ఈ జిల్లాలలో స్కూళ్లకు సెలవు
ఏపీలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాలలో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇతర జిల్లాలలో కూడా వర్షాల కారణంగా సెలవు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గురువారం వరకూ వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది.

