ఆదిలాబాద్ లో ఘనంగా హోలీ వేడుకలు
హోలీ పండగ ప్రతి ఒక్కరి జీవితంలో వారి జీవితమంతా రంగులమయంగా ఉండాలని, ఎలాంటి కష్టాలు లేకుండా భగవంతుడు ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకాంక్షించారు. హోలీ పండుగ వేడుకలను శుక్రవారం పార్టీ శ్రేణులతో పాటు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హోలీ పాటలపై పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ లను కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

