“మూడు రోజులపాటే అసెంబ్లీ జరపడం అంటే ప్రజసమస్యలపై చిత్తశుద్ది లేనట్టే”…ఈటల
‘అసెంబ్లీ సమావేశాలు మూడురోజులు మాత్రమే నిర్వహించడం అంటే ప్రజా సమస్యలపై, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్లే’ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కెసిఆర్ కి పట్టుకుంది. అందుకే అన్ని వర్గాలను మచ్చిక చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు ఈటల రాజేందర్. అసెంబ్లీలో మాకు రూం ఇవ్వకపోవడం, BAC కి పిలవకపోవడం అంటే మమ్ముల్ని కాదు అసెంబ్లీనీ అవమానించారు. మూడు రోజులపాటే అసెంబ్లీ జరపడం అంటే ప్రజసమస్యలపై చిత్తశుద్ది లేనట్టే. వర్షాకాల శాసనసభ సమావేశాలు కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహిస్తే ఎలా అన్నారు. వారికి ఈ మూడురోజులు కూడా సమావేశాలు నిర్వహించడం ఇష్టం లేదని, కేవలం సమావేశం జరగాలి కాబట్టి, మొక్కుబడిగా చేస్తున్నారన్నారు. ముగ్గురు సభ్యులున్న బీజేపీకి, బీఏసీ సమావేశానికి ఆహ్వానం లేదు. కనీసం ఆఫీస్ గది కూడా కేటాయించలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి అవమానం ఎప్పుడూ జరగలేదన్నారు. తెలంగాణాలోని వరదలు, ప్రజాసమస్యలపై ఎలాంటి చర్చలు జరగడానికి అవకాశం లేదన్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో ఏ విషయం జరలేదని, కేవలం ప్రభుత్వ బిల్లులు అమలు పరుచుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఈ సమావేశాలు నిర్వహిస్తోందన్నారు.

