Home Page SliderNational

హిట్‌మ్యాన్‌కు బాల్య స్నేహితుల సర్‌ప్రైజ్

టీ20 వరల్డ్‌కప్ గెలిచి, ముంబైలో జైత్రయాత్ర చేసిన టీమిండియా ప్లేయర్లకు వాంఖడే స్టేడియంలో వైభవంగా ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కప్ సాధించడంలో కీలక పాత్ర వహించిన కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఈవెంట్‌లో మరో సర్‌ప్రైజ్ దొరికింది. రోహిత్ చిన్ననాటి స్నేహితులు ఈ వాంఖడే స్టేడియంలో హిట్‌మ్యాన్‌కు వెల్‌కమ్ చెప్పారు. వరల్డ్‌కప్ తీసుకునేటప్పుడు రోహిత్ చేసిన ఫన్నీ వాక్‌ను అనుకరిస్తూ స్టేడియంలో సందడి చేశారు. అతడిని ఎత్తుకుని, పూలదండ వేసి సంబరాలు చేసుకున్నారు. వీరిలో ముంబయ్ ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబయిలో బీచ్ రోడ్ నుండి వాంఖడే స్టేడియం వరకూ లక్షల మంది అభిమానులు బారులు తీరి టీమిండియాకు ఘన స్వాగతం పలికిన రోడ్ షో దృశ్యాలు, డ్రోన్ వీడియోలు కూడా యూట్యూబ్‌లో లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి.