అమెరికాకు చెందిన ‘జీఈ ఏరోస్పేస్’తో భారత్‌లోని ‘హెచ్‌ఏఎల్’ చారిత్రకఒప్పందం
మోదీ అమెరికా పర్యటన సందర్బంగా భారత్ అమెరికాల మధ్య కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి. భారత్‌కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థకు, అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ సంస్థకు మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. భారత వైమానిక దళాలలో ముఖ్యమైన ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేయడానికి అవగాహన అగ్రిమెంట్ కుదిరిందని జీఈఏ సంస్థ ప్రకటించింది. ఇది చాలా మంచి ఘటన అని, రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తుందని పేర్కొంది.