Home Page SliderInternational

బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ

బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్నహిందువులు భారీగా ర్యాలీ నిర్వహించారు. వేలమంది హిందువులు రోడ్లపై వచ్చి మైనార్టీ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్నారు. చటో గ్రామ్‌లోని సనాతన జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించి తాత్కాలిక ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. వారి డిమాండ్లు నెరవేర్చేవరకూ నిరసన చేస్తామని వారు పేర్కొన్నారు. ఇటీవల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక సంఘటనల వల్ల అప్పటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి, భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.