హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కైవసం..
హిందూపూర్ మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. హిందూపూర్‌లో టీడీపీ అభ్యర్థి ఆరోవార్డ్ కౌన్సిలర్ రమేష్ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో ఆయన 23 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు వచ్చినట్లు సమాచారం. ఈ ఎన్నిక ప్రక్రియను స్వయంగా హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ ఎన్నికను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నిక అనంతరం టీడీపీ అభ్యర్థి రమేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

