ఎయిర్ పోర్ట్ సైన్ బోర్డుల నుంచి హిందీ ఔట్..
బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని సైన్ బోర్డుల నుంచి అక్కడి ప్రభుత్వం హిందీని తొలగించి కన్నడ, ఇంగ్లీషులో మాత్రమే సైన్ బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం ముఖ్యంగా దక్షిణాదిలో పెరుగుతున్న భాషా వివాదానికి కేంద్రంగా మారింది. ఎక్స్ వేదికగా దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు ఈ నిర్ణయాన్ని “మూర్ఖత్వం” అని విమర్శించారు. మరికొందరు ఈ రెండు భాషలు తెలియని వారు విమానాశ్రయానికి వస్తే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. “ఇంగ్లీష్, కన్నడ తెలిసిన వారు మాత్రమే బెంగళూరును సందర్శిస్తారని అనుకుంటున్నారా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.


 
							 
							