మరోసారి బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్..మరి ఈసారి బలైపోయిందెవరు?
ప్రస్తుతం హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ప్రపంచ కుబేరుల్లో గుబులు పుట్టిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఇటీవల భారత అపర కుబేరుడు అదానీ కంపెనీ షేర్లను గరిష్ఠంగా పతనం చేసి కోలుకోలేని దెబ్బకొట్టింది. కాగా దీని నుంచి అదానీ ఇంకా కోలుకోలేదు. అయితే ఇది ఇప్పుడు బ్లాక్ కంపెనీపై రిపోర్ట్ విడుదల చేసింది. ఈ హిండెన్‌బర్గ్ ఆరోపణలతో బ్లాక్ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో కంపెనీ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సంపదలో 526 బిలియన్ డాలర్లు (రూ.4,327 కోట్లు) ఆవిరయ్యాయి. ఆయన సంపద 11% క్షీణించి 4.4బిలియన్ డాలర్లకు చేరింది. కాగా బ్లాక్ కంపెనీ నిర్వాహకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొంది. ఈ విధంగా హిండెన్‌బర్గ్ రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.