కాంగ్రెస్‌కు హిమాన్షు వ్యాస్ గుడ్ బై
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఏఐసీసీ కార్యదర్శి, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ సీనియర్ నేత హిమాన్షు వ్యాస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ చీఫ్ ఖర్గేకు పంపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన అనంతరం వ్యాస్ పార్టీకి రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది. వ్యాస్ సురేంద్రనగర్‌లోని వద్వాన్ స్థానం నుంచి రెండు సార్లు పోటీ చేసీ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. హిమాన్షు త్వరలో బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది.