Andhra PradeshHome Page Slider

తిరుమలలో హై లెవెల్ సెక్యూరిటీ ఆడిట్-యాంటీ డ్రోన్ టెక్నాలజీ

తిరుమల కొండకు వచ్చే శ్రీవారి భక్తులకు ఇకపై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండనున్నాయి. నిన్న మొదలైన హైలెవెల్ సెక్యూరిటీ ఆడిట్ ఈరోజు కూడా కొనసాగుతోంది. సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బృందం చాలా కూలంకుషంగా తనిఖీలు చేస్తున్నారు. ఈమధ్యకాలంలో శ్రీవారి ఆలయపరిసరాలు సెల్‌ఫోన్లలో చిత్రీకరణ, శ్రీవారి ఆనందనిలయంపై డ్రోన్‌లు, హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టడం వంటి సంఘటనలతో అలెర్ట్ అయ్యారు అధికారులు. భద్రతా సిబ్బంది వైఫల్యాలకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. చిన్న పిల్లల కిడ్నాపింగ్, కొండపై మద్యం, గుట్కాలు లభ్యం వంటి అన్ని ఘటనలకు చెక్ పెట్టనున్నారు.

దీనితో యాంటీ డ్రోన్ టెక్నాలజీతో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. తిరుమలలోని అన్ని భద్రతా దళాలలను ఒకే గొడుగు కింద తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల మనోభావాలకు ఇబ్బందిలేకుండా, ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, టెక్నాలజీ వాడుకుంటూ  ఈ ఏర్పాట్లను చేయనున్నారు. టీమ్‌ల వైజ్‌గా గస్తీలు ఏర్పాటు చేయడం, పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పాట్లు, ఉగ్రముప్పు వంటి అన్ని విషయాలకు చెక్ పెట్టే చర్యలపై పది రోజుల పాటు సమీక్షలు జరగనున్నాయి. వీటిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, తగిన చర్యలు తీసుకోనున్నారు.