Andhra PradeshBreaking NewsBusinessHome Page Slider

బెజ‌వాడ చీరల అవ‌క‌త‌వ‌క‌ల‌పై హైకోర్టు తీర్పు

ఇంద్రకీలాద్రిపై చీరల స్కామ్‌పై దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది.. అమ్మవారికి భక్తులు ఇచ్చిన చీరల అమ్మకాల్లో అవకతవకలు జ‌రిగియాన్న కోణంలో విచార‌ణ చేప‌ట్టిన అదికారుల‌కు విస్తుపోయే వాస్త‌వాలు వెలుగుచూశాయి.2018-19 మధ్య జరిగిన అమ్మకాల్లో రూ.కోట్లలో అవినీతి జ‌రిగిన‌ట్లు అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రూ.1.68 కోట్ల మేర నగదు స్కాం జరిగినట్లు అధికారులు గుర్తించి ద‌ర్యాప్తుని మ‌రింత వేగ‌వంతం చేశారు. చీరల అమ్మకాల బాధ్యతలు నిర్వహించిన ఈవో, జూనియర్ అసిస్టెంట్.. గత జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, అప్పటి ఈవో భ్రమరాంబకు ప్ర‌భుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.దీంతో షోకాజ్ నోటీసుపై సుబ్రహ్మణ్యం హైకోర్టుకు వెళ్లాడు .ఈ నేప‌థ్యంలో జిల్లా ఎండోమెంట్ అధికారితో ఎంక్వైరీ వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి ఎంక్వైరీ జరిగే వరకూ పెనాల్టీ, చర్యలు వద్దని హైకోర్టు తీర్పునివ్వ‌డం గ‌మ‌నార్హం.