ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. సీబీఐ విచారణకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఎమ్మె్ల్యేల ఎర కేసులో రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇకపై ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టనుంది. సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. కేసు విచారణను సీబీఐకి అప్పగించొద్దంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ప్రభుత్వం వేసిన అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది.


