తీర్పిచ్చే వరకు అవినాష్ అరెస్టు వద్దన్న హైకోర్టు
మాజీ మంత్రి వివేక హత్యకు సంబంధించి సీబీఐకి, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు వెలువరించే వరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ తనపై తీవ్ర చర్యలు తీసుకొవద్దని ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణకు సంబంధించి ఆధారాలివ్వాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీంతో కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐ హైకోర్టుకు సమర్పించింది. 10 డాక్యుమెంట్లు, 35 సాక్ష్యుల వాంగ్మూలాలు, ఫోటోలను అందించింది. అదే సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డ్ చేసినట్టుగా సీబీఐ కోర్టుకు వివరించింది. విచారణ సందర్భంగా అవినాష్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో కేసు విచారణ సమయంలో మీడియాతో మాట్లాడటంపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

