బాప్టిజం ఘాట్ నిర్మాణంపై హైకోర్టు స్టే
వివాదాస్పదమైన గుంటూరు జిల్లా మంగళగిరిలో బాప్టిజం ఘాట్ నిర్మాణంపై హైకోర్టు స్టే ఇచ్చింది. డొంక భూమిలో దీనిని చేపడుతున్నారని ఆరోపణలు రావడంతో దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది. మంగళగిరి బాప్టిజం ఘాట్ నిర్మాణంపై కొద్ది రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. క్రిస్టియన్ మిషనరీలు చేపడుతున్న ఈ ఘాట్ నిర్మాణం మత మార్పిడులను ప్రోత్సహించడానికేనంటూ హిందూ సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. తమకు ప్రభుత్వం ఆ భూమిని కేటాయించిందని, పవిత్ర స్నానాలకు ఈ ఘాట్ నిర్మాణం చేస్తున్నామని క్రిస్టియన్ సంఘాలు ఎదురుతిరగడంతో ఈ గొడవ హైకోర్టుకు చేరింది. ఈ కేసును మూడు వారాలపాటు వాయిదా వేసింది.