తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్
రిపబ్లిక్ డే వేడుకలను పరేడ్‌తో నిర్వహించాల్సిందేనంటూ తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐతే కరోనా తర్వాత పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించడం లేదని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. గణతంత్ర దినోత్సవవేడుకలు దేశ వ్యాప్తంగా 1950 నుంచి జరుగుతున్నాయని… పరేడ్ ఎక్కడ జరపాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించాలని హైకోర్టు ఆదేశించింది. గణతంత్ర వేడుకలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రిపబ్లిక్ డే వేడుకలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.

