సంచలనం సృష్టిస్తున్న ‘హైడ్రా’పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
TG: సంచలనం సృష్టిస్తున్న ‘హైడ్రా’పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా(జీవో 99)ను వెంటనే రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. GHMC యాక్ట్‌ను కాదని, హైడ్రాకు అధికారాలు ఎలా బదిలీ చేస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. కాగా HYDలోని చెరువులలో గల నిర్మాణాలను FTL, బఫర్ జోన్‌లో ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇది మీకు తెలిసిన విషయమే.


 
							 
							