Home Page SliderTelangana

మల్లారెడ్డి వర్సిటీలపై చర్యలకు హైకోర్టు ఆదేశం

టిజి: మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. ఎలాంటి అనుమతులు లేకుండా దూలపల్లిలో మల్లారెడ్డి యూనివర్సిటీ, బాలానగర్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కామర్స్ అండ్ డిజైన్ క్యాంపస్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ యూజీసీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆ రెండు క్యాంపస్‌లను ఏర్పాటు చేశారంటూ నవీన ఎడ్యుకేషన్ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. వర్సిటీలపై చర్యలకు ఆదేశించింది.