Home Page SliderNational

కేజ్రివాల్‌కు మరోసారి హైకోర్టు నోటీసులు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌కు గుజరాత్ మెజిస్ట్రేట్ కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. కాగా గతంలో ప్రధాని మోదీ డిగ్రీకి సంబంధించిన సర్టిఫికెట్లను అధికారులకు చూపించాలని ఢిల్లీ సీఎం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు మోదీ డిగ్రీ సర్టిఫికెట్లను ఎవరికి చూపించాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చింది. కాగా ప్రధాని మోదీ డిగ్రీకి సంబంధించిన కేసులో వచ్చే నెల 7న విచారణకు రావాలని సీఎం కేజ్రివాల్‌కు గుజరాత్ హైకోర్టు సమన్లు జారీ చేసింది. కేజ్రివాల్‌తో పాటు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు కూడా ఈ కేసులో సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఇచ్చిన నోటీసుల్లో స్పష్టత లేదని..మరోసారి జారీ చేసినట్లు అడ్వకేట్ అమిత్ నాయక్ తెలిపారు.