Andhra PradeshHome Page Slider

సీఎం వైఎస్ జగన్‌కు హైకోర్టు నోటీసులు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వ్యక్తిగత హోదాలో నోటీసులు అందాయి. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిధులను అనుచితంగా వినియోగించుకోవడమంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. వైసీపీకి సహాయం చేసేందుకు ఉద్దేశించిన ప్రకటనలు, ప్రచురణలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. కేసు విచారణకు వచ్చిన తర్వాత, ఏపీ ఆర్థిక కార్యదర్శి, సీఎం జగన్‌కు కోర్టు నోటీసులు పంపింది. వైసీపీ ప్రతిష్టను పెంచి, గత ప్రభుత్వాలను దెబ్బతీసేలా ప్రకటనలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలను మంజూరు చేసిందనేది పిటిషనర్ ఆరోపించారు. జగతి పబ్లికేషన్స్ వంటి సంస్థలకు ప్రభుత్వ హోదాలో ప్రజల సొమ్మును జారీ చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు.