బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
బీఆర్‌ఎస్ పార్టీ కోకాపేటలో 11 ఎకరాల భూమి తమ పార్టీకి కేటాయించుకుందని ఫోరం ఫర్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎకరం 50 కోట్లు పలుకుతున్న విలువ గల భూమిని బీఆర్‌ఎస్ పార్టీకి 3.41 కోట్లకే కేటాయించారని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. దీనికి సంబంధించిన భూకేటాయింపు డాక్యుమెంట్లను రహస్యంగా పెట్టినట్లు కూడా ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనితో హైకోర్టు వారికి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది.

