Home Page SliderTelangana

స్పెషల్ షోలపై హైకోర్టు సీరియస్

రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరోవైపు.. ఈ చిత్రానికి టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలపై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెనిఫిట్ షోలను రద్దు చేశామని చెప్పి… ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించింది. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత తెల్లవారుజాము షోలకు అనుమతిని ఇవ్వడంపై పునరాలోచించాలని చెప్పింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వొద్దని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.