చంద్రబాబు IRR కేసుపై హైకోర్టులో విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది. అయితే హైకోర్టు ఇవాళ మరోసారి చంద్రబాబు IRR కేసుపై విచారణ చేపట్టింది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. కాగా ఇటీవల చంద్రబాబుకు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

