పిన్నెల్లికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది.కండీషన్ బెయిల్ పై ఉన్న పిన్నెల్లికి విదేశాలకు వెళ్లే వెసులుబాటు కల్పించింది. ఈ ఏడాదిలో జరిగిన ఎన్నికల సమయంలో ఈవిఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెయిల్ పై ఉన్న పిన్నెల్లికి విదేశాలకు వెళ్లేలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయనకు మరింత ఊరట లభించింది.