NewsTelangana

ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుల విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఫామ్ హౌస్ కేసు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుల దర్యాప్తుపై స్టేను హైకోర్టు ఎత్తివేసింది. కేసును పోలీసులు విచారించవచ్చని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది. కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ వేసిన పిటిషన్ ను ఈనెల 18న విచారించాలని కోర్టు నిర్ణయించింది. ఈ కేసులో బీజేపీకి పిటిషన్ వేసేందుకు అర్హత ఉందని కోర్టు స్పష్టం చేసింది.