Home Page SliderPoliticsTelangana

షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే.. పాదయాత్రకు గతంలో తాము విధించిన షరతులు వర్తిస్తాయని తెలిపింది. ఆ షరతులను గుర్తుంచుకోవాలని సూచించింది. తెలంగాణను తాలిబన్‌ స్టేట్‌ అని షర్మిల అనడాన్ని తప్పుపట్టిన హైకోర్టు.. పాదయాత్రలో రాజకీయపరమైన విమర్శలు మాత్రమే చేయాలని, వ్యక్తిగత విమర్శలు చేయవద్దని సూచించింది. పాదయాత్రకు సంబంధించి ఇరువైపు వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. షర్మిల పాదయాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.