బండి పాదయాత్రకు హైకోర్టు అనుమతి
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బండి పాదయాత్ర నిలిపివేయాలంటూ వర్ధన్నపేట ఏసీపీ ఇచ్చిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో బండి సంజయ్ పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. ఆగిన చోట నుంచే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కానుంది.