ఢిల్లీలో హై అలర్ట్
పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ జారీ చేశారు. దీంతో పలు పర్యాటక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాల తాజా హెచ్చరికల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులతో ఢిల్లీ పోలీసులు చర్చలు జరిపారు. సున్నితమైన, రద్దీ ప్రాంతాలపై ఫోకస్ పెంచారు.