మధుర మీనాక్షి ఆలయ నిర్వాహకులపై హీరోయిన్ నమిత ఫైర్
నటి నమితకు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణాష్టమి సందర్భంగా తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లిన తనను సిబ్బంది అడ్డుకున్నారని ఒక వీడియో రిలీజ్ చేసారు. “నన్ను, నా కుటుంబ సభ్యులను హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారు, నేను పుట్టుకతో హిందువును. నాపై అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బందిని శిక్షించాలి. సిబ్బంది అహంకారంగా, దురుసుగా ప్రవర్తించారు”, అని ఆ వీడియో లో ఆమె చెప్పుకొచ్చారు.