Home Page SliderNational

శివాలయంలో హీరోయిన్.. సెల్ఫీ కోసం ఎగబడ్డ సాదువులు

బాలీవుడ్ నటి అమీషా పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ముంబై – జుహూలో ఉన్న ఓ శివాలయానికి అమీషా పటేల్‌ వెళ్లింది. అయితే.. ఇక అమీషా పటేల్ వచ్చిందని ఆమెను చూసేందుకు భక్తులు, బాబాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆమె సెల్ఫీ కోసం బాబాలు కూడా ఎగబడడం విశేషం. ఆమెను భక్తులతో పాటు బాబాలు కూడా చుట్టు ముట్టారు. దీంతో ఆమె చాలా ఇబ్బందికి గురైంది. అక్కడ ఉన్న టెంపుల్ సెక్యూరిటీ వాళ్లందరినీ నెట్టెశాడు. ఇక బాబా నుంచి తనను రక్షించినందుకు సెక్యూరిటీ సిబ్బందికి అమీషా కృతజ్ఞతలు తెలిపింది. అయితే.. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.