ప్రిజం పబ్‌లో హీరోయిన్ పై దాడి
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్‌లో హీరోయిన్ కల్పికపై దాడి జరిగింది. బర్త్‌డే కేక్ విషయంలో కల్పిక, పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వాగ్వాదం తీవ్రమైన నేపథ్యంలో పబ్ సిబ్బంది కల్పికపై దాడికి దిగారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.