‘హీరోలకు వయసు రాదా?’..సీనియర్ హీరోయిన్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటీమణులకు ముఖ్యమైన పాత్రలు ఇవ్వాలని, వృద్ధాప్యం అనేది ఒక సమస్య కాదని కామెంట్ చేశారు సీనియర్ హీరోయిన్ మనీషాకోయిరాలా. ఇటీవల ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ తాను జీవించి ఉన్నంతకాలం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సినిమాలలో ఎలాంటి సన్నివేశాలనైనా మహిళలు చేయగలరని హీరోలు ఎంత వయసు వచ్చినా ప్రాధాన్యత గల పాత్రలు ఇస్తారని, వారికి వయసు రావట్లేదా అని ప్రశ్నించారు. పెద్దవయసు హీరోయిన్లకు తల్లి, సోదరి పాత్రలు ఇస్తున్నారని, కానీ తాము యాక్షన్ పాత్రలు కూడా అలవోకగా చేయగలమని పేర్కొన్నారు. 50 దాటిన తర్వాత కూడా మనం అద్భుతమైన జీవితాన్ని గడపగలం అని, రానున్న తరాలకు మార్గదర్శి కావాలని పేర్కొన్నారు. ఆమె ఇటీవలే క్యాన్సర్ బారినుండి కోలుకుని, హీరామండి అనే వెబ్ సిరీస్‌లో మల్లికా జాన్ అనే పాత్రలో మెప్పించారు.

