Home Page SliderNational

కల్తీసారా మరణాలపై హీరో విశాల్ ట్వీట్

తమిళనాడులో కల్తీసారా తాగి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరగడంతో హీరో విశాల్ స్పందించారు. 34మంది కల్తీ మద్యం తాగి ప్రాణాలు వదిలారు. ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వానికి హీరో విశాల్ ట్వీట్ చేశారు. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. మద్యం షాపుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కల్లకురుచ్చి జిల్లాలోని కరుణాపురంలో కల్తీమద్యం తాగి 90 మందికి పైగా ఇప్పటికే ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 34 మంది మరణించారు. మరణించిన వారి కుటుంబాలకు స్టాలిన్ రూ. 10 లక్షలు సాయం ప్రకటించారు.