గ్రామాల్లో రాత్రి స్కూళ్లు ఏర్పాటు చేయనున్న హీరో విజయ్
తమిళస్టార్ హీరో దళపతి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని గ్రామాల్లో రాత్రిపూట స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా దళపతి విజయ్ పేరుతో నైట్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి విజయ్ అభిమాన సంఘం “మక్కల్ ఇయకం”జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో రేపు తమిళనాడు వ్యాప్తంగా మాజీ సీఎం కామరాజ్ విగ్రహాలకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో నోట్ బుక్స్ పంపిణీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

