RRR మూవీపై హీరో నిఖిల్ కామెంట్స్
RRR సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో మనందరకూ తెలుసు. దర్శకశిల్పి జక్కన్న రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ దీనిని ఆస్కార్‌కు నామినేట్ చేయకుండా ‘చెల్లోషో’ అనే గుజరాతీ చిత్రాన్ని నామినేట్ చేశారు.
ఈ సందర్భంలో తాజాగా హీరో నిఖిల్ చేసిన కామెంట్స్ చాలా వైరల్ అవుతున్నాయి. RRR సినమాకు ఆస్కార్ అవసరమా ?. అనే కామెంట్‌తో స్పందించాడు. తనకు ఆస్కార్‌పై అంత మంచి అభిప్రాయం లేదని, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వనని అన్నాడు. మనకు ఫిల్మ్‌ఫేర్, జాతీయ అవార్డులు, నంది అవార్డులు వంటివెన్నో ఉన్నాయి. ఇక మనకు ఆస్కార్ ఎందుకు? RRR సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆదరించారు. ఇటీవలే స్పెయిన్‌లో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇంక ఆస్కార్ వస్తే ఎంత, లేకపోతే ఎంత అని నా ఫీలింగ్ అని నిఖిల్ అన్నారు. ప్రేక్షకుల అభిమానమే ఆస్కార్‌తో సమానం అని కామెంట్స్ చేశాడు.

