Home Page SlidermoviesNational

నయనతారపై హీరో ధనుష్ దావా

సీనియర్ హీరోయిన్ నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్‌పై హీరో ధనుష్ మద్రాస్ హైకోర్టులో దావా వేశారు. ధనుష్ నిర్మాతగా ఉన్న ‘నానుమ్ రౌడీ దాన్’ అనే చిత్ర విజువల్స్‌ను నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీలో వాడుకున్నారని ఆరోపణలు చేశారు. ఇటీవలే ఈ విషయంగా తనకు రూ.10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం దీనిపై విచారణకు అంగీకరించింది. అయితే ఈ లీగల్ నోటీసుల విషయంలో ఇప్పటికే నయనతార సోషల్ మీడియాలో సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. ఈ చిత్ర సెట్‌లోనే నయనతార, విఘ్నేష్‌ల స్నేహం, వివాహానికి బీజం పడింది. అందుకే ఈ చిత్రం తనకు ముఖ్యమైనదని వారు భావించారు. అయితే నిర్మాత ధనుష్ అంగీకరించకపోవడం వల్ల కోలీవుడ్‌లో కలకలం మొదలయ్యింది.