Home Page SliderNational

విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య

నటుడు-దర్శకుడు ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఫిల్మ్ మేకర్ ఐశ్వర్య రజనీకాంత్… చెన్నైలోని స్థానిక కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం సెక్షన్ 13 బి- కింద ధనుష్- ఐశ్వర్య పిటిషన్ దాఖలు చేసినట్లు కూడా సమాచారం. పెళ్లై, పద్దెనిమిదేళ్ల తర్వాత ఈ స్టార్ జంట జనవరి 17, 2022న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంట 2004లో వివాహం చేసుకున్నారు. యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులకు తల్లిదండ్రులు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక ఇంటర్వ్యూలో, ఐశ్వర్య తన వివాహం, విడాకుల విషయాలను బయట ప్రపంచానికి వివరించారు. గత రెండేళ్లుగా దంపతులు విడివిడిగా జీవిస్తున్నారు. తన రెండు సంవత్సరాల ఒంటరి జీవితాన్ని ప్రతిబింబిస్తూ, ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. “నేను గ్రహించిన ప్రధాన విషయం ఏమిటంటే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం సురక్షితంగా ఉండగలం. ఈ ఒంటరితనం నాకు చాలా ఇష్టం’’ అని ఆమె వ్యాఖ్యానించారు.