Home Page SliderNational

నెయ్యిలో కల్తీని ఇలా కనుక్కోండి

ఈమధ్య నెయ్యి కల్తీపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ తిరుమల పుణ్యక్షేత్రంలోనే మహా ప్రసాదం లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి కలిసిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితులలో మనం రోజూ ఉపయోగించే నెయ్యి సహజమైనదా, కల్తీనా కనుక్కోవడం ముఖ్యం. కల్తీరాయుళ్లు కొందరు వెజిటబుల్ ఆయిల్స్, జంతుకొవ్వు, ఫ్యాట్స్ కలిపిన కల్తీ నెయ్యిని యధేచ్ఛగా రకరకాల లేబుల్స్ వేసి, అమ్మేస్తున్నారు. అందుకే కల్తీ నెయ్యిని కనపెట్టడానికి కొన్ని చిట్కాలు పాటించండి.

అరచేతిలో నెయ్యి తీసుకుని రుద్ది చూడండి. కరిగిపోతే మంచి స్వచ్ఛమైన నెయ్యి అని, కరగకపోతే కల్తీ జరిగిందని అర్థం.

నెయ్యిలో కొన్ని డ్రాప్స్ అయొడిన్ వేసి చూడండి. నీలం రంగులో మారితే కల్తీ అని అర్థం.

నెయ్యి కొంచెం తీసుకుని చేతికి రాసి రుద్దండి. సువాసన ఎక్కువ సమయం నిలిచిఉంటే మంచిది. వాసన లేకపోతే కల్తీ అనుకోవాల్సిందే.

కాస్త నెయ్యికి చక్కెర జోడించి గాజు సీసాలో మూతవేసి బాగా షేక్ చేయండి. నెయ్యి అడుగున ఎర్రగా గీతలు కనిపిస్తే కల్తీ నెయ్యే.

నెయ్యిని కరగబెట్టినప్పుడు అది నూనెలా ఉంటుంది. అలా కాకుండా పసుపు, తెలుపు రంగుల్లో ఉంటే అది కల్తీ నెయ్యే.