Home Page SliderTelangana

ఇక్కడ మెడవంచి వెళ్లాల్సిందే!

గద్వాల: జిల్లా కేంద్రంలోని మేలచెర్వు రహదారిలో కర్నూల్, రాయచూర్ వైపునకు వెళ్లే రైల్వే గేటు పడితే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆరు నెలల కిందట ఇక్కడ ఆర్‌యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మిస్తున్నారు. పనులు నెలలు గడుస్తున్నా కంప్లీట్ కావడం లేదు. సమీపంలోని పిల్లిగుండ్ల కాలనీకి, మేలచెర్వు వైపు పలు గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారి మూసివేయడంతో రాయచూర్ రైల్వే లైన్‌కు సంబంధించి నిర్మించిన కల్వర్టు కింది భాగం నుండి మెడ వంచుకుని వెళ్లాల్సి వస్తోంది. వాహనదారులు అజాగ్రత్తగా వెళితే తలకి బొప్పికట్టడం ఖాయం. ఇలా ఎన్నాళ్లు వెళతాం. వెంటనే పక్కా ప్రణాళికతో పక్కనే దారి ఒకటి నిర్మించాలని మనవి.