ఇకపై 8.30 గంటల్లోనే సికింద్రాబాద్ టు తిరుపతి
ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల ప్రజలు తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లాలంటే ఎన్నో గంటల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సివచ్చేది. అయితే ఇప్పుడు మాత్రం అన్ని గంటల ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇకపై అత్యంత వేగంగా అంటే 8.30 గంటల్లోనే తిరుపతి చేరుకోవచ్చు. అది ఎలా అని ఆలోచిస్తున్నారా? త్వరలో ప్రారంభం కానున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఇక నుంచి 8.30 గంటల్లోనే తిరుపతి చేరుకోవచ్చు. ఈ వందేభారత్ రైలు ఏప్రిల్ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్ నుంచి పరుగులు పెట్టనుంది. కాగా ఈ రైలు మంగళవారం మినహ అన్ని రోజులలో ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. అయితే ఈ రైలు ఛార్జీల వివరాలను రైల్వేశాఖ ఇంకా ప్రకటించలేదు. కాగా ఈ రైలు ఏప్రిల్ 9న తిరుపతి నుంచి మధ్యహ్నం 3:15 నిమిషాలకు బయల్దేరి నెల్లూరు,ఒంగోలు,గుంటూరు,నల్గొండ మీదుగా రాత్రి 11:45గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మళ్లీ తిరిగి ఏప్రిల్ 10న ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మధ్యహ్నం 2:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ విధంగా ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కేవలం 8:30 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లొచ్చు.