సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలపై కీలక నిర్ణయం
సీబీఎస్‌ఈ నిర్వహించే సెంట్రల్ బోర్డు పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షలు సీసీటీవీ నిఘాలో జరగాలని నిర్ణయించింది. 2025 విద్యాసంవత్సరంలో నిర్వహించబోయే 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షా కేంద్రాలలో సీసీటీవీలను ఏర్పాటు చేయడం తప్పనిసరిగా సీబీఎస్‌ఈ ప్రకటించింది. ఈ మేరకు విద్యాసంస్థలకు, పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. సీసీటీవీ సౌకర్యం లేని పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా అనుమతించేది లేదని తేల్చి చెప్పింది.

