కుప్పకూలిన హెలికాఫ్టర్..ఐదుగురు మృతి
చార్‌ధామ్ యాత్ర కోసం బయల్దేరిన ఏరో ట్రింక్ ప్రైవేట్ కంపెనీకి చెందిన హెలికాఫ్టర్ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఈ హెలికాఫ్టర్‌లో ఏడుగురు ప్రయాణికులున్నట్లు తెలిసింది. ఇది ముక్కలు, ముక్కలుగా పేలిపోవడంతో ప్రమాదం ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి.

