National

కేదార్‌నాథ్ యాత్రలో కుప్పకూలిన హెలికాఫ్టర్

కేదార్‌నాథ్: మనసర్కార్

శివభక్తులందరికీ జీవితంలో ఒక్కసారైనా కేదార్‌నాథ్ వెళ్లాలనే ఆశ ఉంటుంది. అలాంటి ఆశతోనే వెళ్తున్న యాత్రికులతో కూడిన హెలికాఫ్టర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలిపోయింది. పాపం ఆభక్తులు సరాసరి పరమశివుని సన్నిధినే చేరుకున్నారు. ఈ హెలికాఫ్టర్ ‘ఫటా’ హెలిప్యాడ్ నుండి యాత్రికులను తీసుకెళుతుండగా ఇంకా కేదార్‌నాథ్ ఆలయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ‘గరుడ్ ఛాటి’ అనే ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

ఈ సంఘటన తెలిసిన అధికారులు, NDRF సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఆరు మృతదేహాలు లభించాయి. వారిలో ఇద్దరు పైలట్లుగా గుర్తించారు. నలుగురు ప్రయాణీకులు అని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా పూర్తి  వివరాలు తెలియవలసి ఉంది.