Home Page SliderTelangana

మంగళ, బుధవారాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు

హైదరాబాద్: తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలింపింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుండి అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.