Home Page SliderNationalNews Alert

భారీ హిమపాతం..జమ్మూ కశ్మీర్‌కు కనెక్షన్స్ బంద్..

భారీగా కురుస్తున్న హిమపాతం కాశ్మీరు లోయను వణికిస్తోంది. దీనితో ఇతర ప్రాంతాలతో అన్నిరకాల రవాణాలు రద్దు అయ్యాయి. రోడ్డు, రైల్వే సహా, విమాన ప్రయాణాలు కూడా నిలిచిపోయాయి. కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జమ్మూ నుండి శ్రీనగర్‌కు తాను వెళ్లానని, బనిహాల్ నుండి శ్రీనగర్‌ వరకూ మంచు ఎడతెరిపి లేకుండా కురుస్తోందని, ఖాజిగుండ్ వద్ద 2 వేల వాహనాలు మంచులో కూరుకుపోయాయని పేర్కొన్నారు. కశ్మీర్ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారి, మొఘల్ రోడ్డులు మూసివేశారు. శ్రీనగర్ విమానాశ్రయం నుండి అన్ని రకాల విమాన సర్వీసులు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్‌లపై భారీగా మంచు పేరుకుపోవడంతో బనిహాల్-బారాముల్లాల మధ్య పలు రైళ్లు రద్దు చేశారు.