కేరళను ముంచెత్తిన భారీ వర్షాలు
కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో కేరళలలో జనజీవనం అస్థవ్యస్థమవుతోంది. కాగా కేరళలోని 11 జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాలు ఇప్పటికే నీటమునిగాయి. అయితే కేరళలోని 6జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆ 6 జిల్లాల్లోని స్కూళ్లకు కేరళ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ భారీ వర్షాలకు కేరళలలోని పలు వాగలు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో NDRF సిబ్బంది బోట్ల సాయంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టారు.అయితే ఈ వర్షాల కారణంగా కేరళలలో ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా..మరో ఐదుగురు గల్లంతయినట్లు తెలుస్తోంది.

