రెండు రోజుల్లో భారీ వర్షాలు..
AP: రాష్ట్ర ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. చెమటలతో సతమతమవుతున్నారు. సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో గాలిలో తేమశాతం ఎక్కువగా పెరగడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల విపరీతంగా చెమటలు, ఎక్కువ దాహం, డీ హైడ్రేషన్ వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు. రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుందని, మన్యం జిల్లాలు, అల్లూరి, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు.