నేడు, రేపు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
టిజి: రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో మోస్తరు నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం, మంగళవారం వరకు ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన అతి భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.