తెలంగాణలో 7, 8 తేదీల్లో భారీ వర్షాలు
టిజి: రాష్ట్రంలో ఈ నెల 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 7న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో, 8న మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.