Home Page SliderNational

ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు

ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఢిల్లీ,నోయిడాలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. కాగా ఈ వర్షానికి కన్నాట్ ప్లేస్,ఉత్తర ఢిల్లీ ,మింటో బ్రిడ్జ్,మజ్ను కా తిలా,లుటియన్స్,జంతర్ మంతర్ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. ఈ ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  మరోవైపు ఉత్తర భారత దేశంలోనూ..మరో నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. కాగా నైరుతి రుతువపనాల ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్థం అవుతోంది.